జితే పీర్ దర్గా గంధ మహోత్సవం వైభవంగా

1చూసినవారు
జితే పీర్ దర్గా గంధ మహోత్సవం వైభవంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లిలోని హజ్రత్ జితే పీర్ దర్గా వద్ద గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో చాదర్ సమర్పించారు. మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎన్టీఆర్ నగర్, కేటీఆర్ నగర్ కాలనీల నుంచి భక్తులు భారీ ర్యాలీగా దర్గాకు చేరుకుని ఉత్సవాల్లో పాల్గొన్నారు. వెంకటేష్ గౌడ్ మతసామరస్యాన్ని కొనియాడుతూ, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్