ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తీవ్ర ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కోళ్ల మృతి
May 27, 2026, 10:05 IST/

తీవ్ర ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కోళ్ల మృతి

May 27, 2026, 10:05 IST
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండల కారణంగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. గత మూడు రోజుల్లోనే ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 15 లక్షల కోళ్లు, ఉమ్మడి రాయలసీమలో 10 లక్షలు, ఉత్తరాంధ్రలో 4 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్లు సమాచారం. సాధారణంగా 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగల కోళ్లు, 45-48 డిగ్రీల వరకు నమోదవుతున్న వేడితో వడదెబ్బకు గురై చనిపోతున్నాయని పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు. కోళ్లకు చల్లటి నీరు, ఎలక్ట్రోలైట్స్, విటమిన్-సి, బెల్లం కలిపిన నీరు ఇవ్వాలని, మేతను విడతలవారీగా అందించాలని, షెడ్లను చల్లబరచడానికి తెల్లని పెయింట్, గ్రీన్ నెట్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.