కుత్బుల్లాపూర్ దుండిగల్ బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా విశేష అభిషేకములు, దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్ప స్వాములు పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పూర్తి ఉపవాస దీక్షతో భజనలో పాల్గొన్నారు.