పోలియో శిబిరాన్ని సందర్శించిన కిషోర్ రెడ్డి

0చూసినవారు
పోలియో శిబిరాన్ని సందర్శించిన కిషోర్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 294వ డివిజన్ బహదూర్‌పల్లి పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో శిబిరాన్ని రాష్ట్ర ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి సందర్శించారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ. ఆర్. సాదు యాదవ్, పరశురాములు, సలీం బాయ్, అమర్ పటేల్, కాశీ విశ్వనాథ్, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్