జీతం ఉన్నా జీవితం సురక్షితం కాదు…అప్పుల ఒత్తిడికి బలి

5చూసినవారు
జీతం ఉన్నా జీవితం సురక్షితం కాదు…అప్పుల ఒత్తిడికి బలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యూనిటీ బ్యాంక్ మేనేజర్ రేవంత్ కుమార్ (38) తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి స్వగ్రామం నుంచి నాలుగేళ్ల క్రితం భార్యాపిల్లలతో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన, పద్మానగర్ ఫేజ్-2లో నివాసం ఉంటూ బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం తీసుకున్న అప్పులు పెరిగిపోవడంతో, వాటిని తీర్చలేక తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్