కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్‌లో, ప్రగతి నగర్ కమాన్ సమీపంలో మియాపూర్ రోడ్‌లో ఉన్న సుమారు 35 ఫర్నిచర్ షాపులలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని దుకాణాలకు కూడా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.