గ్లాండ్ ఫార్మా కంపెనీలో మేడే వేడుకలు

3చూసినవారు
గ్లాండ్ ఫార్మా కంపెనీలో మేడే వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ (డి. పోచంపల్లి)లోని గ్లాండ్ ఫార్మా కంపెనీలో మే డే సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, కార్మిక సంఘం అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, రాష్ట్ర పురోగతి కార్మికుల కష్టం మీదే నిలబడి ఉందని, ప్రతి కార్మికుడి వెనుక ఒక కుటుంబం, ఆశలు, భవిష్యత్తు ఉన్నాయని గుర్తుచేశారు. సరైన వేతనం, భద్రత, గౌరవం కోసం పోరాడుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడం సమాజం మొత్తం బాధ్యత అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్