జై శ్రీరామ్ నగర్ కమిటీకి కొత్త కార్యవర్గం

339చూసినవారు
జై శ్రీరామ్ నగర్ కమిటీకి కొత్త కార్యవర్గం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జై శ్రీరామ్ నగర్ కాలనీ అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కొత్త కమిటీ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి రెండు సంవత్సరాల కాలపరిమితిని నిర్ణయించారు. వేణు ముదిరాజ్ కాలనీ ప్రెసిడెంట్‌గా, అనిల్ కుమార్ జనరల్ సెక్రటరీగా, సురేందర్ ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన ప్రెసిడెంట్ వేణు ముదిరాజ్ కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్