కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ క్యూఆర్ కోడ్, మైక్రో చిప్, ఉద్యోగి నంబర్, పేరు, ఫోటో వంటి వివరాలతో కూడిన కొత్త ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ఐడీ కార్డుల ద్వారా సచివాలయ ఉద్యోగులను సులభంగా గుర్తించవచ్చు. ఇటీవల సచివాలయంలో నకిలీ ఉద్యోగులు ప్రవేశించి భద్రతకు ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సచివాలయంలో 1600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, వారందరికీ ఈ కొత్త ఐడీ కార్డులు అందజేస్తున్నారు.