పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వద్దు: డిప్యూటీ కమిషనర్

300చూసినవారు
పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వద్దు: డిప్యూటీ కమిషనర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత, వ్యర్థాల తొలగింపును క్రమం తప్పకుండా చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిప్యూటీ ఇంజనీర్ అన్వేష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్