గాజులరామారం సర్కిల్‌లో ఆక్రమణలపై అధికారుల చర్యలు

224చూసినవారు
గాజులరామారం సర్కిల్‌లో ఆక్రమణలపై అధికారుల చర్యలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ ప్రధాన రహదారిపై శనివారం జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణలను తొలగించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆర్. సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ బి. సరిత సేన్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్