కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను నియంత్రించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.