చలివేంద్రం ప్రారంభం – ప్రజలకు చల్లని సేవ

279చూసినవారు
చలివేంద్రం ప్రారంభం – ప్రజలకు చల్లని సేవ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 డివిజన్ సంజీవయ్య నగర్‌లో జయశంకర్ విగ్రహం వద్ద గంగాధర్ గారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జాలిగం రాకేష్ ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చే ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని, ఇది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని రాకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్