సూరారంలో డ్రైనేజీ సమస్యతో ప్రజల అవస్థలు

0చూసినవారు
సూరారంలో డ్రైనేజీ సమస్యతో ప్రజల అవస్థలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ పరిధిలోని సూరారం ఆర్‌కే ట్రాన్స్‌పోర్ట్, రుద్ర హోటల్ సమీపంలో డ్రైనేజీ నీరు పొంగిపొర్లి నర్సాపూర్–బాలానగర్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో స్థానికులు అల్లాడుతున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్