పేట్‌బషీరాబాద్‌లో ప్రేమ విఫలమై బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి పి.మల్లికార్జున్ (19) ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలానికి చెందిన మల్లికార్జున్, మైసమ్మగూడలోని ఎంఆర్ఎస్ఐటీ కళాశాలలో చదువుతున్నాడు. తోటి స్నేహితులతో మాట్లాడిన కొద్దిసేపటికే, గురువారం నుంచి ఇంటర్నల్ పరీక్షలు ఉండగా, హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కళాశాలలో చదువుతున్న అమ్మాయి ప్రేమను నిరాకరించడమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.