హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ప్రగతి నగర్
ఎన్టీఆర్ పార్కుల్లో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నారై కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు సాంబశివ రెడ్డి, బొట్ల తిరుపతిలు ఆయనను కలిసి పలు సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా ప్రతి ఏటా వర్షాకాలంలో ఎన్నారై కాలనీలో తలెత్తుతున్న వరదనీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఝాన్సీ లక్ష్మీబాయి పార్క్‌లో చిన్నపిల్లల ఆట పరికరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని, ఓపెన్ జిమ్ రిపేర్ చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. దీనిపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.