సూడో పోలీస్ ముఠా అరెస్ట్

0చూసినవారు
కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నకిలీ పోలీసుల ముఠాను అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా కేసు సెటిల్ చేస్తామని చెప్పి కూకట్‌పల్లికి చెందిన వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేయడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి పోలీస్ స్టిక్కర్లు ఉన్న రెండు కార్లు, దేశీయ తుపాకి, ఎయిర్ గన్, పోలీస్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్