కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులతో బుధవారం బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పర్యటించారు. ఆయన సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అధికారులను కోరారు. శ్రీరామ్ నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను కూడా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.