కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పర్యటించిన మాజీ డీప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కాలనీ వాసులకు కలిసి సమస్యలను శనివారం అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు ముఖ్యంగా రోడ్లపై చెత్త, డ్రైనేజీ, వీధి కుక్కల బెడద మరియు చెత్త సేకరణ సమస్యలను మాజీ డీప్యూటీ మేయర్ కి తెలియజేశారు. సమస్యల పైన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.