కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్ పల్లి లో సోమవారం చోరీ చేశారు. ఓ ఇంటి తాళం బద్దలుకొట్టి మూడు ఉంగరాలు, 7 తులాల వెండి వస్తువులు, ఒక సెల్ ఫోన్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.