కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ మెట్ కానిగూడ, కృష్ణ మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో పదిరోజులకు ఒకసారి త్రాగునీటి సరఫరా జరుగుతుందని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేయగా, వెంటనే ఎమ్మెల్యే స్పందించారు.