కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లిలోని గ్రీనీల్స్ కాలనీలో ఆదివారం ఆడపడుచుల పండుగ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు రాబోయే 9 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. గ్రీన్ హిల్స్ హోసింగ్ కాలనీలో సుబ్రహ్మణ్య సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, బతుకమ్మ పాటలతో సందడి చేశారు.