కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీ కృష్ణ నగర్ లో రోడ్డు మరియు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అని తెలియజేయడంతో కాలనీ వాసులతో కలిసి కాలనీ లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి ఆదివారం పర్యటించి కాలనీ లో ఉన్న సమస్యల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.