కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్ పల్లి మరియు గండి మైసమ్మ, డి పోచంపల్లి లో శనివారం పలు కాలనీలలో అనుమతికి మించిన నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఫలితం ఏమి లేకుండా పోతుంది. మితిమీరిన అంతస్తులతో ఎలాంటి అనుమతి లేని షడ్ నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ సహాయ సహకారాలతో పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.