కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూరపల్లిగ్రీన్ హిల్స్ కాలనీలో ఓ డెకరేషన్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డెకరేషన్ సామాన్లతో పాటు, పక్కనే పార్క్ చేసిన కారు కూడా పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. నివాస ప్రాంతాల్లో గోదాంలు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.