కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ లో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో అప్రమత్తమైన రవణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.పాఠశాల బస్సుల ఫిట్నెస్ లను అధికారులు తనిఖీ చేశారు. అందులో ఐదు వెహికల్స్ కు ఫిట్నెస్ లేకపోవడంతో సీజ్ చేయడం జరిగిందని శిల్పా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ వెహికల్స్ తనిఖీలలో మేడ్చల్ ఆర్టీవో అధికారులు, మరియు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.