కుత్బుల్లాపూర్: విద్యుదాఘాతంతో మహిళ మృతి

0చూసినవారు
కుత్బుల్లాపూర్: విద్యుదాఘాతంతో మహిళ మృతి
సూరారం కాలనీ ముత్యాలబస్తీలో శనివారం ఉదయం సీతల్ రాథోడ్ (23) అనే గృహిణి దుస్తులు ఉతుకుతూ, నీళ్లు వేడి చేయడానికి అమర్చిన హీటర్ ను ప్రమాదవశాత్తు తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. భర్త విజయ్ రాథోడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.