కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాపిడో పార్సెల్‌పై అనుమానం రావడంతో డ్రైవర్ సత్తు ఆదర్శ్ దుండిగల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తనిఖీ చేయగా, ఒక డ్రగ్ కన్జ్యూమర్‌తో పాటు బీహార్‌కు చెందిన డ్రగ్ పెడలర్ రూపేష్ కుమార్ (23)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అప్రమత్తంగా వ్యవహరించిన రాపిడో డ్రైవర్ సత్తు ఆదర్శ్‌ను కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి ఐపీఎస్ శాలువాతో సత్కరించి అభినందించారు.