కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 293 డివిజన్ విశ్వకర్మ కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, మహిళా భవన్ సమస్యలపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. కే. శ్రీనివాస్ రెడ్డి, ఎస్. జీవన్ రెడ్డి, ఈ. నరసింహ, మల్లేష్ సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాలనీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సకాలంలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.