ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500, 200 యూనిట్ల ఉచిత కరెంట్, నిరుద్యోగ భృతి రూ. 4 వేలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని పేర్కొన్నారు.