కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ శ్రీరామ్ నగర్ పరిధిలోని బేకరీ గడ్డ లో సీసీ రోడ్ పూర్తిగా పాడవటంతో బస్తి వాసులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై ఆయన స్పందించారు. జిహెచ్ఎంసి ఫండ్స్ ద్వారా సిసి రోడ్ నిర్మాణానికి 29,00,000 రూ మంజూరు చేయించి సోమవారం రోడ్డును నియోజకవర్గ ఇంచార్జి ప్రారంభించారు.