కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలోని కెనెడీ హై – ది గ్లోబల్ స్కూల్ నుండి నందనవనం కాలనీ వరకు మంజూరైన రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రజల నిత్యావసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, రోడ్డు నిర్మాణంతో పాటు కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.