నిర్మానుష్య ప్రాంతాల్లో దారిదోపిడి గ్యాంగ్ అరెస్ట్

0చూసినవారు
నిర్మానుష్య ప్రాంతాల్లో దారిదోపిడి గ్యాంగ్ అరెస్ట్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాల్లో దారిదోపిడీలకు పాల్పడుతున్న అనిల్, నవీన్ అనే ఇద్దరు పాత నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు, స్మార్ట్‌ఫోన్, ఉంగరం, మోటార్‌సైకిల్‌తో సహా సుమారు ₹5 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎంటి అటవీప్రాంతంలో రాత్రివేళ వాహనదారులను బెదిరించి దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్