భాగ్యలక్ష్మి కాలనీ, సుభాష్ నగర్‌లో పారిశుధ్య తనిఖీలు

61చూసినవారు
భాగ్యలక్ష్మి కాలనీ, సుభాష్ నగర్‌లో పారిశుధ్య తనిఖీలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లావణ్య పారిశుధ్య తనిఖీలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లే స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణను పరిశీలించి, తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ప్రజలకు సూచించారు. వాణిజ్య దుకాణాల్లో డస్ట్‌బిన్‌ల వాడకాన్ని తనిఖీ చేసి, 120 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్ల వాడకంపై హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్