సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

1చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లో భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పర్యావరణ ప్రేమికులు, సామాజిక వేత్త కోలా రవీందర్ ముదిరాజ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా శుక్రవారం సూరారం చౌరస్తాలో నార్త్ సిటీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, అప్పటి నైజాం పాలనలో హైదరాబాదును విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. విద్యార్థులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.

ట్యాగ్స్ :