కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని సాయి బృందావనం ఎస్టేట్స్ లో ఆదివారం శ్రీదేవీశరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు వేడుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.