గ్రీన్ హిల్స్ కాలనీ, బహదూర్ పల్లిలోని శ్రీ నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ సాయి సుబ్రహ్మణ్య సేవా సమితి సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్ గారి సమక్షంలో, ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ మహా లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం, బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో వేడుకలను జరుపుకున్నారు.