సుచిత్రలోరాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు– బస్సులతనిఖీలు

4చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర నాగ్‌పూర్ నుండి హైదరాబాదుకు వచ్చే ప్రైవేట్ బస్సుల ద్వారా గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సుచిత్ర, కొంపల్లి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. సి. ఐ బాలరాజ్ నేతృత్వంలో సుమారు 20 బస్సులను ఆపి సోదాలు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వాహనాలను పరిశీలించారు. గంజాయి స్మగ్లింగ్‌పై నిఘా మరింత కఠినం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సి. ఐ బాలరాజ్, ఎస్‌ఐ సంధ్యా, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్