సూరారం నాలా సమస్య పరిష్కారానికి చర్యలు

4చూసినవారు
సూరారం నాలా సమస్య పరిష్కారానికి చర్యలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ సాయిబాబా నగర్ డివిజన్ లోని సూరారం కాలనీ, దయానంద్ నగర్, రాజుల స్వామి నగర్ ప్రాంతాల్లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాలా సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచన మేరకు జరిగిన ఈ సమావేశంలో, అటవీ ప్రాంతం గుండా నాలా నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. అధికారులు సమస్యను పరిశీలించి, త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్, కావలి రవి, మైసా గౌడ్, వేణు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you