కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం "ఫీజు పోరు బాట" కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలను మూసివేయాలని బిఆర్ఎస్వి పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసుకుని పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యపై బిఆర్ఎస్వి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.