చెంగిచర్ల ఆర్టీసీ డీఎంగా స్వాతి

4చూసినవారు
చెంగిచర్ల ఆర్టీసీ డీఎంగా స్వాతి
చెంగిచర్ల డిపో మేనేజర్గా ఎస్. స్వాతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కంటోన్మెంట్ డిపోకు బదిలీ అయిన కె. కవిత స్థానంలో ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ప్రయాణికులకు సురక్షిత, సమయపాలనతో కూడిన నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానన్నారు. చెంగిచర్లను ఆదర్శ డిపోగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషితో ముందుకు సాగుతానన్నారు. అధికారులు, ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్