అనారోగ్యంతో కుదేలైన గాగిల్లాపూర్ తండా కుటుంబం

3చూసినవారు
అనారోగ్యంతో కుదేలైన గాగిల్లాపూర్ తండా కుటుంబం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ డివిజన్ గాగిల్లాపూర్ తండాకు చెందిన కాట్రోత్ లక్ష్మణ్ నాయక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు, లివర్ దెబ్బతినడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్