ఖాకీ సినిమా తరహాలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్

7చూసినవారు
గత నెల 7వ తేదీన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పి.ఎస్. పరిధిలోని బౌరంపేటలో సోమేశ్వర జ్యువలర్స్ షాపులో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో రాజస్థాన్ కు చెందిన ఆరుగురు ఈ దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించారు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు, 'ఖాకీ' సినిమా తరహాలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి దొంగిలించబడిన 15 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్