మల్లంపేట్ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు చెక్

0చూసినవారు
మల్లంపేట్ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు చెక్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాచుపల్లి నుండి ORR ఎగ్జిట్–4A వరకు అనుసంధాన మార్గంగా ఉండటంతో ఏర్పడుతున్న భారీ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు, జంక్షన్‌ను సిమెంట్ బ్లాకులతో మూసివేసి, కొంత దూరంలో యూ-టర్న్ ఏర్పాటు చేశారు. దీనివల్ల వాహనాల రాకపోకలు ప్రస్తుతం సాఫీగా సాగుతున్నాయి. రాత్రి సమయంలో భద్రత కోసం సిమెంట్ బ్లాకులపై రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ నరసింహారావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్