కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారావు చౌరస్తాలో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో రోజూ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల బస్సులు, ఆర్టీసీ బస్సులు ఆగడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ఎమ్మెల్యే గారు ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.