దుండిగల్‌లో విషాదం.. బైక్‌ను ఢీకొట్టిన బొలెరో

283చూసినవారు
దుండిగల్‌లో విషాదం.. బైక్‌ను ఢీకొట్టిన బొలెరో
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్‌పై వెళ్తున్న తల్లి, కుమారుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుమ్మడి ఉదయ్ లతా రెడ్డి (49) అక్కడికక్కడే మృతి చెందగా, డిగ్రీ విద్యార్థి వేదాంత్ రెడ్డి (22) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బొలెరో డ్రైవర్ మత్తులో ఉండి కావాలనే ప్రమాదం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్