కొంపల్లిలో ఘనంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన

0చూసినవారు
కొంపల్లిలో ఘనంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి డివిజన్ జయబేరి పార్క్ లోని న్యూ మార్క్ పృథ్వీ హోమ్స్ లో శ్రీ వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరిత రావు, అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కొంపల్లి డివిజన్ అధ్యక్షుడు సతీష్ సాగర్ లు ఈటల రాజేందర్ కు స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ ప్రతిష్ఠాపన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్