శ్రమజీవుల సంక్షేమమే సమాజ సమృద్ధికి మార్గం: ఎమ్మెల్యే

0చూసినవారు
శ్రమజీవుల సంక్షేమమే సమాజ సమృద్ధికి మార్గం: ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ నెహ్రూ నగర్‌లో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ చైతన్య సాగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కార్మిక యూనియన్ జెండాను ఎగురవేసి, కార్మిక సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించిన లెటర్ హెడ్‌ను ఆవిష్కరించారు. శ్రమజీవుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి కీలకమని, ఐకమత్యంతో పనిచేస్తేనే ప్రగతి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్