కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి హై విజన్ రెసిడెన్స్‌లో రహీం భాయ్ (30) అనే యువకుడు గుర్తుతెలియని విష పదార్థం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం లేకపోవడం, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి ఇంటికి వచ్చిన చెల్లెలు తలుపులు తెరవకపోవడంతో స్థానికుల సహాయంతో లోపలికి వెళ్లి చూడగా మృతదేహంగా కనిపించాడు. కేసు నమోదు చేసి పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.