కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని బరంపేట వార్డులో థై బజార్, మార్కెట్ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, ఐఏఎస్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఓపెన్ నాలాలలో పేరుకుపోయిన సిల్ట్, చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు సంబంధిత ప్రాంతాల్లో డీసిల్టింగ్, పూడికతీత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా నాలాల శుభ్రత పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.